తన ఫేవరెట్ హీరోని కలసిన రకుల్ ప్రీత్ సింగ్

తన ఫేవరెట్ హీరోని కలసిన రకుల్ ప్రీత్ సింగ్

Published on Nov 22, 2014 4:04 PM IST

rakul-preet-sharukh

వరుస విజయాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్, ఇటీవల తన ఫేవరెట్ హీరోని కలిసింది. కింగ్ ఖాన్ షారుఖ్ అంటే రకుల్ ప్రీత్ సింగ్ కు ఎనలేని అభిమానమట. ప్రస్తుతం ఈ ఢిల్లీ అందగత్తె రమేష్ సిప్పీ దర్శకత్వంలో ‘సిమ్లా మిర్చి’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. ముంబైలో షూటింగ్ జరుగుతున్న సమయంలో షారుఖ్ ఖాన్ రమేష్ సిప్పీని కలవడానికి వచ్చారు. తన అభిమాన హీరో సెట్స్ లో ప్రత్యక్షం అయ్యేసరికి రకుల్ ప్రీత్ సింగ్ ఆనందానికి అవధులు లేవు. తదేకంగా కళ్ళు అప్పగించి షారుఖ్ ను చోస్తూ ఉండిపోయింది.

20 నిముషాలు పాటు షారుఖ్ ఖాన్ మాతో మాట్లాడారు. తన కొత్త సినిమా కబుర్లు చెప్పారు. ఒక స్టార్ హీరో అనే గర్వం అతనిలో కనపడలేదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. షారుఖ్ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు అతనితో మాట్లాడం, మా షూటింగ్ కి రావడం కలలా అనిపించింది. అని రకుల్ ప్రీత్ సింగ్ తన సంతోషాన్ని పంచుకుంది.

తాజా వార్తలు