
హర్షవర్ధన్ రాణే, పూర్ణ ప్రధాన పాత్రల్లో విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు డైరెక్ట్ చేసిన చిత్రం ‘అవును’. 2012లో విడుదలైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న ‘అవును 2’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవ్వడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అందుకే ఈ చిత్ర టీం ఇటీవలే ‘అవును 2’ ఫస్ట్ లుక్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
టీజర్ తర్వాత ఈ రోజు సాయంత్రం ఈ మూవీ ఫిస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. మామూలుగా ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి తర్వాత్ త్రైఅల్ర్ రిలీజ్ చేస్తారు. కానీ రవిబాబు మాత్రం ముందు ట్రైలర్ రిలీజ్ చేసి తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నాడు.డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ‘అవును 2’లో హర్షవర్ధన్ రాణే, పూర్ణలతో పాటు సంజన, నికిత ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

