
టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి చేస్తున్న ‘మేము సైతం’ ప్రోగ్రాం నవంబర్ 30వ తేదీన జరగనుంది. ఈ వేడుకకి సంబందించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 30న జరిగే టెలీథాన్ ప్రోగ్రాం మాత్రమే కాకుండా నవంబర్ 29వ తేదీన డైన్ విత్ స్టార్స్ కార్యక్రమం కూడా ఉండనుంది. ఈ వేడుకకి దాదాపు అందరు స్టార్స్ హీరోస్ హీరోయిన్స్ కలిసి రానున్నారు.
ఈ వేడుకలో స్టార్స్ తో కలిసి మీరు డిన్నర్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి పలు ప్రోగ్రామ్స్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి వచ్చే స్టార్స్ మరియు పార్టిసిపెంట్స్ ని యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ తన ఆట, పాటతో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ ప్రోగ్రాం లో దేవీశ్రీ 30 నిమిషాల పాటు తన బ్యాండ్ తో సందడి చేయనున్నారు. అంతే కాకుండా కామెడీ నైట్స్ కపిల్ కూడా ఈ కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంటర్టైన్ చేయనున్నాడు.
ఇవే కాకుండా పలు ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. మీరు కూడా డైన్ విత్ స్టార్స్ ప్రోగ్రాం లో పాల్గొనాలంటే లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోండి. మీకు టికెట్స్, బుక్ మై షో మరియు మేమిసైతం అఫీషియల్ వెబ్ సైట్ లో కొనుక్కోవచ్చు.

