‘మేము సైతం -వుయ్ లవ్ వైజాగ్’ టెలిథాన్ కార్యక్రమంలో నందమూరి నట సింహం బాలకృష్ణ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు అనే వార్తను 123తెలుగు.కామ్ గతంలో పాఠకులకు తెలియజేసింది. ప్రస్తుతం జరుగుతున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో ‘చలాకీ చూపులతో… ‘ పాటను పాడారు.
బాలయ్య పాటకు అద్బుత స్పందన లభించింది. రొమాంటిక్ సాంగ్ ను ఫుల్ జోష్ లో పాడిన బాలయ్య ‘మేము సైతం’ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులను, అభిమానులను, ఆహుతులను అలరించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. బాలయ్య లైవ్ పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకుల నుండి అద్బుత స్పందన లభించింది.
‘మేము సైతం’ లైవ్ స్ట్రీమింగ్ వీడియో చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


