మహేష్, పవన్ ఇద్దరిలో నేను గమనించిన క్వాలిటీ – త్రివిక్రమ్

మహేష్, పవన్ ఇద్దరిలో నేను గమనించిన క్వాలిటీ – త్రివిక్రమ్

Published on Nov 30, 2014 5:08 PM IST

mahesh-samantha

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరితో రెండేసి సినిమాలకు దర్శకత్వం వహించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి స్టార్ హీరోలతో త్రివిక్రమ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్, మహేష్ లతో ఒకే తరహా రిలేషన్షిప్ ఎలా కొనసాగిస్తున్నారు అనే సందేహం చాలా మందిలో కలిగింది. ఈ ప్రశ్నకు ‘మేము సైతం’ కార్యక్రమంలో త్రివిక్రమ్ సమాధానం ఇచ్చారు.

పవన్, మహేష్ ఇద్దరిలో నేను గమనించిన ఓకే క్వాలిటీ సింప్లిసిటీ. హంగూ ఆర్బాటాలకు వెళ్లరు. వారితో సన్నిహితంగా మెలగడం చాలా ఈజీ. అని త్రివిక్రమ్ స్పందించారు.

‘మేము సైతం’ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలసి అందాల తార సమంత చేసిన ఈ ఇంటర్వ్యూ ఆహుతులను అలరించింది. సమంత అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ తనదైన శైలిలో పంచ్ ఆన్సర్స్ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు