‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో భాగంగా తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్స్ నాలుగు టీంలుగా విడిపోయి సూపర్ సిక్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ నాగార్జున, ఎన్టీఆర్ టీంల మధ్య జరిగింది. నాగార్జున టీంకు అఖిల్ అక్కినేని కెప్టెన్ గా వ్యవహరించగా, ఎన్టీఆర్ టీంకి శ్రీకాంత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ మ్యాచ్ లో నాగార్జున టీం విజయం సాధించింది. రెండవ మ్యాచ్ వెంకటేష్, రామ్ చరణ్ టీంల మధ్య జరుగుతుంది.
ఈ రోజు ఉదయం నుండి ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ కార్యక్రమంలో ప్రముఖులు నిర్విరామంగా ప్రదర్సనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను సియం రిలిఎఫ్ ఫండ్ కు అందజేస్తారు. కబడ్డీ తర్వాత ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్ లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.


