వారణాశిలో మొదలైన పవన్ కళ్యాణ్ సాంగ్ షూట్

వారణాశిలో మొదలైన పవన్ కళ్యాణ్ సాంగ్ షూట్

Published on Dec 1, 2014 6:37 PM IST

Gopala Gopala
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గత వారమే విక్టరీ వెంకటేష్ – శ్రియ శరన్ ల పైన వైజాగ్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో ఓ పాటని షూట్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం అంతా ఫైనల్ సాంగ్ షూట్ కోసం వారణాశి వెళ్ళారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వచ్చే ఓ పాటని షూట్ చెయ్యడం కోసం ఈ చిత్ర టీం వారణాశి వెళ్ళారు. ఈ రోజు ఉదయం నుంచి ఆ చివరి పాట షూటింగ్ ని మొదలు పెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. పవన్ పై వచ్చే ఈ స్పెషల్ సాంగ్ ని మరో 5 రోజుల పాటు అక్కడే షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ షూట్ తో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత ఒక వారం రోజుల టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉంటుంది.

నవంబర్ 28న రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు