
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే అభిమానుల్లో ఏవో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి. అలా వైబ్రేషన్స్ వచ్చే అభిమానుల్లో యంగ్ హీరో నితిన్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ – నితిన్ కి మంచి స్నేహపూరితమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఇక్కడ వీరిద్దరి గురించి ఎందుకు చెబుతున్నాను అనే విషయానికి వస్తే.. నితిన్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చిన్నదాన నీకోసం’. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నితిన్ ఈ సినిమాని రిలీజ్ కంటే ముందే పవన్ కళ్యాణ్ కి చూపించి తన ఒపీనియన్ మరియు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ కి ఓ స్పెషల్ షో వేయడానికి నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం పవన్ గోపాల గోపాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ టైం దొరికితే వచ్చి ఈ సినిమా చూడమని నితిన్ కోరాడని సమాచారం. ఈ ఆహ్వానానికి పవన్ కళ్యాణ్ కూడా కాస్త సముఖతగా ఉన్నట్లు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ వచ్చి ఈ సినిమా చూసి నితిన్ ని ఎంకరేజ్ చేస్తాడేమో చూడాలి.
నితిన్ సరసన మిస్తి హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి కరుణాకరన్ డైరెక్టర్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిఖిత రెడ్డి ఈ సినిమాని నిర్మించింది.

