బుల్లితెర రికార్డులు బ్రేక్ చేసిన ‘మేము సైతం’

బుల్లితెర రికార్డులు బ్రేక్ చేసిన ‘మేము సైతం’

Published on Dec 11, 2014 4:03 PM IST

memu-saitham--logo
హుధుద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలసి చేసిన ‘మేము సైతం’ కార్యక్రమం బుల్లితెర రికార్డులను బ్రేక్ చేసింది. 14 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ కార్యక్రమం సగటున(ఎవరేజ్ గా) 13.4 టిఆర్‌పి రేటింగ్ నమోదు చేసింది. సౌత్ ఇండియాలో అత్యధిక ప్రజలు చూసిన బుల్లితెర కార్యక్రమంగా మరో రికార్డు సృష్టించింది. ‘మేము సైతం’కు వచ్చిన స్పందన చూసి చిత్ర పరిశ్రమ సంతోషం వ్యక్తం చేసింది. వీక్షకాదరణ పొందడం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చినా మేం అండగా ఉంటాం అని ‘మేము సైతం’ ద్వారా చిత్ర పరిశ్రమ మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమం ద్వారా 11 కోట్ల రూపాయల విరాళాలను సేకరించిన సంగతి విదితమే.

తాజా వార్తలు