అనుష్కని తెగ పొగిడేస్తున్న కన్నడ బ్యూటీ

అనుష్కని తెగ పొగిడేస్తున్న కన్నడ బ్యూటీ

Published on Dec 11, 2014 4:58 PM IST

Parvathy-Nair
స్వతహాగా బెంగుళూరు బ్యూటీ అయిన పార్వతి నాయర్ గత రెండు సంవత్సరాలుగా తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ పార్వతీ నాయర్ కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’, అజిత్ నటించిన ‘ఎన్నై అరింధాల్’ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ కానున్నాయి. అందులో అజిత్ సినిమా ‘ఎంతవారు గాని’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పార్వతి నాయర్ అనుష్క తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఈ సినిమా షూటింగ్ లో పార్వతి నాయర్ షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు టాప్ హీరోయిన్ అయిన అనుష్క తనని ట్రీట్ చేసిన విధానం చూసి షాక్ అయిపోయింది. దాంతో ఆమె అనుష్క సింప్లిసిటీని తెగ పొగిడేస్తోంది. ‘అనుష్కని నేను అంతక ముందు కలవలేదు. కానీ ఒక హీరోయిన్ గా నేను ఆమెని చాలా గౌరవిస్తాను. తను పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ లుక్ లో ఉంటుంది. అసలు స్టార్ హీరోయిన్ అన్న ఆలోచనే ఆమెలో ఉండదు. తను నా బర్త్ డే రోజు సెట్లో ఇచ్చిన సర్ప్రైజ్ నేను ఎప్పుడూ మర్చిపోలేనని’ పార్వతి నాయర్ తెలిపింది. అనుష్క నటించిన ‘లింగ’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు