వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ‘గోపాల గోపాల’ న్యూ స్టిల్స్

వెంకటేష్ పుట్టినరోజు కానుకగా ‘గోపాల గోపాల’ న్యూ స్టిల్స్

Published on Dec 11, 2014 9:23 PM IST

Gopala-Gopala2
‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పుడు మరికొన్ని స్టిల్స్ ను చిత్ర బృందం విడుదల విడుదల చేయనున్నారు.

డిసెంబర్ 13న, విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ‘గోపాల గోపాల’ ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ బయటకు రానున్నాయి. ఈ స్టిల్స్ లో వెంకీ ఎటువంటి సందడి చేస్తారోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తున్నారు. కిషోర్‌ పార్దసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పవన్‌ స్నేహితుడు శరత్ మరార్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు