ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను చెన్నైలో కావేరి హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. చికిత్స జరుగుతుంది. ప్రస్తుతం బాలచందర్ వయసు 84 సంవత్సరాలు.
ఇటీవలే ‘ఉత్తమ విలన్’ సినిమాలో బాలచందర్ నటించారు. తమిళ, తెలుగు, హిందీ బాషలలో అనేక విజయవంతమైన సినిమాలకు బాలచందర్ దర్శకత్వం వహించారు. ‘అంతులేని కథ’, ‘ఇది కథ కాదు’, ‘మరో చరిత్ర’ వంటి సినిమాలు ఆయన దర్శకత్వంలో రూపొందినవే.
రజినీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, వివేక్ వంటి నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్ సొంతం. లెజెండ్రీ దర్శకుడు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే తమిళ, తెలుగు చిత్ర సీమ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నారు.


