కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో గల మండువా లోగిలి ప్రదేశంలో జరుగుతుంది. మహేష్ బాబు, హీరోయిన్ శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, అలీ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు యూత్ ఫుల్ లుక్ లో కనిపిస్తారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ఇది. సూపర్ హిట్ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యారు కొరటాల శివ. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


