
సినిమా తారల దగ్గర డబ్బులు తాండవమాడతాయి అనడంలో సందేహం లేదు. అయితే వారికి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మారడం అవసరమైన అంశం. అందంగా కనిపించడానికి చాలా మంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని న్యాచురల్ బ్యూటీని కోల్పోతారు. అలాంటి వ్యవహారాలకు కాజల్ అగర్వాల్ పూర్తిగా విరుద్ధమని తెలిపింది
ఒక ప్రధాన మీడియా సంస్థకి కాజల్ ఇంటర్వ్యూ ఇస్తూ, అసహజంగా కనిపించే సర్జరీలు చేయించుకోవడం నాకు ఇష్టముండదు. ఫిట్ గా వుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపితే మోములో ఛాయ దానంతట అదే వస్తుందని తెలిపింది.
ప్రస్తుతం కాజల్ ఎన్.టి.ఆర్ సరసన ‘టెంపర్’లో నటిస్తుంది

