ఐదేళ్ళ నుండి డాన్స్, తెలుగు నేర్చుకుంటున్నా – అఖిల్ అక్కినేని

ఐదేళ్ళ నుండి డాన్స్, తెలుగు నేర్చుకుంటున్నా – అఖిల్ అక్కినేని

Published on Dec 21, 2014 7:52 PM IST

Akhil (1)

హీరోగా మొదటి సినిమా కొబ్బరికాయ కొట్టక ముందే అక్కినేని అఖిల్ పెద్ద స్టార్ అయిపోయాడు. ‘టైటాన్‌’, ‘మౌంటన్‌ డ్యూ’ వాణిజ్య ప్రకటనలలో నటించి అందరి చేత ఔరా అనిపించాడు. ఇటివలే వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తొలి సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నాడు.

ఈ ప్రిపరేషన్ గురించి అఖిల్ మాట్లాడుతూ.. నేను నేచురల్‌ డ్యాన్సర్‌ని కాను, ప్రెజెంట్ యంగ్ హీరోలందరూ అద్బుతంగా డాన్స్ చేస్తున్నారు. వారికి తగ్గకుండా డ్యాన్స్‌ చేయడానికి, వారి పోటి తట్టుకోవడానికి గత ఐదేళ్ళ నుండి నేర్చుకుంటున్నాను. నేను బెస్ట్ డాన్సర్ అని చెప్పను కానీ ఇప్పుడు బాగానే చేయగాలుతున్నాను. అలాగే తెలుగు మాట్లాడటం బాగా నేర్చుకున్నాను. ఐదేళ్ళ క్రితం వరకూ తెలుగు రాయటం, చదవటం వచ్చినా సరిగా మాట్లాడలేకపోయేవాడిని. నా తెలుగు ఉచ్చారణ మేరుగవ్వడం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక డబ్బింగ్‌ థియేటర్‌ లో విభిన్న పాత్రలకు డబ్బింగ్‌ చెబుతూ ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను. అని అఖిల్ అన్నారు.

తాజా వార్తలు