రాజమౌళి తండ్రికి హీరో దొరికాడు.

రాజమౌళి తండ్రికి హీరో దొరికాడు.

Published on Jan 1, 2015 1:45 PM IST

SS-Rajamouli-gets-hero's-fa
ప్రముఖ కథా రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించడానికి సిద్దమయ్యారని 123తెలుగు.కామ్ గతంలో తెలియజేసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ (2010) నేహ హింగే ఎంపిక చేశారు. నేహ హింగే సరసన జోడిగా రాఘవేంద్ర రాజు అనే కొత్త కుర్రాడిని హీరోగా ఎంపిక చేశారు. వైజాగ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో రాఘవేంద్ర రాజు నటనలో మెళకువలు నేర్చుకున్నారు. హీరోగా అతనికిదే తొలి సినిమా.

విజయేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో హీరోగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది రెగ్యులర్ టైపు సినిమా కాదు, హాలీవుడ్ స్థాయిలో రూపొందనున్న ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని రాఘవేంద్ర రాజు తెలిపారు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు