కన్నుమూసిన ఫేమస్ రైటర్ గణేష్ పాత్రో

కన్నుమూసిన ఫేమస్ రైటర్ గణేష్ పాత్రో

Published on Jan 5, 2015 10:22 AM IST

ganesh
భారతదేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న సాహితీ కారుడు, సినీ రైటర్ గణేష్ పాత్రో ఈ రోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తన తుదిశ్వాస విడిచారు. 1945లో జన్మించిన ఈయన 1965లో తెలుగు సినిమా రంగంలోకి రైటర్ గా ఎంటర్ అయ్యారు. ఆయన కె. బాలచందర్ గారి కాంబినేషన్ లో చాలా సినిమాలకు పనిచేసారు.

ఆయన తెలుగులో మొదటగా అత్తారిల్లు సినిమాకి మాటలు రాసారు. ఆ తర్వాత మరో చరిత్ర, ఇది కథకాదు, గుప్పెడు మనసు, మయూరి, మా పల్లెలో గోపాలుడు, రుద్రవీణ, సీతారామయ్య గారి మనవరాలు, నిర్ణయం సినిమాలకు మాటలు రాసారు. గణేష్ పాత్రో చివరిగా తెలుగులో చేసిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఆయన మాటల రచయితగానే కాకుండా నిర్ణయం సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘హలో గురూ ప్రేమకోసమే రా జీవితం’ అనే పాటని కూడా రాసారు. ఇలాంటి గొప్ప రచయితని సినీ ఇండస్ట్రీ కోల్పోవడం తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అంతే కాకుండా ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు.

గణేష్ పాత్రో గారి మరణానికి మేము చింతిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు