మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో ఒకటే ‘కాకా’. దర్శకుడు కొల్లి బాబీతో వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ లుక్స్ పరంగా కూడా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని మొదట్లోనే తెలిపాము.
ఇటీవల వచ్చిన టైటిల్ గ్లింప్స్ లో సింపుల్ లుక్స్ లో కనిపించిన మెగాస్టార్ లోని మరో కోణాన్ని కూడా బాబీ ప్రెజెంట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ స్వగృహానికి వెళ్లిన మెగాస్టార్ క్యాప్ పెట్టుకొని కనిపించడం పైగా లుక్ కూడా మంచి రఫ్ గా చిన్నగా మెలితిప్పిన మీసంతో కనిపించడం జరిగింది.
దీనితో కాకా లో బాబీ ఇంకేం సర్ప్రైజ్ ప్లాన్ చేసారా అని ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కాబోతుంది.
Blessed to have Megastar Chiranjeevi Garu grace our Ganesh Visarjan Pooja at the Asian Cinemas office.
A truly memorable and divine moment!#asiancinemas #chiranjeevikonidela #boss #ganeshvisarjan pic.twitter.com/7Oa79Ix0EW— Asian Cinemas (@AsianCinemas_) September 20, 2026


