పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘గబ్బర్ సింగ్ 2’. ఈ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కానీ ఈ సినిమా పలు కారణాల వాళ్ళ ఒక సంవత్సరం పై నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ నుంచి ఇటీవలే గబ్బర్ సింగ్ 2 కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే బాబీ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులను పవన్ దగ్గరుండి చూసుకుంటున్నాడు.
పవన్ సన్నిహితుల నుంచి మాకు అందిన తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉన్నారు. అలాగే పవన్ నడుం నొప్పి కారణంగా సర్జరీ చేయించుకునే వార్తలని కూడా వారు కొట్టిపారేశారు. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమాలో అనీష అంబ్రోస్ హీరోయిన్ గా నటించనుంది. సంక్ర్నతి కానుకగా పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమా విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.


