
కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన సునీల్ హీరోగా మారిన తర్వాత మొదట్లో మంచి హిట్ సినిమాలు చేసాడు. కానీ కొద్ది రోజులుగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. అందులో మొదటగా ‘జోష్’ సినిమా డైరెక్టర్ వాసు వర్మ దర్శకత్వంలో చేయనున్న సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి కోన కథా సహకారం అందిస్తున్నారు. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇది కాకుండా సునీల్ చేయనున్న మరో సినిమా ప్రముఖ రైటర్ గోపీ మోహన్ డైరెక్షన్ లో ఉంటుంది. గోపి మోహన్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసాడు. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మాతగా సునీల్ హీరోగా, నా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి నేను – కోన వెంకట్ కలిసి ఓ భిన్నమైన కథని రూపొందించాం. సునీల్ – వాసువర్మ సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా పార్లల్ గా జరిగేలా ప్లాన్ చేస్తున్నాం. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో ఈ సినిమా ప్రారంభం అవుతుందని’ గోపి మోహన్ తెలిపాడు.

