వక్కంతం వంశి కథతో మహేష్ – పూరి సినిమా..?

వక్కంతం వంశి కథతో మహేష్ – పూరి సినిమా..?

Published on Feb 5, 2015 1:15 AM IST

vakantham-vamshi
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాకు వక్కంతం వంశి కథ అందించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించిన పూరి, కెరీర్లో తొలిసారిగా ఒక బయట రచయిత అందించిన కథను సినిమాగా మలిచారు. వక్కంతం వంశి పనితీరు నచ్చిన పూరి, అతనితో కలిసి పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ మంచి కథ రెడీ చేయమని వంశికి పూరి పురమాయించారట. ప్రస్తుతం వక్కంతం వంశి అదే పనిలో ఉన్నారు. అన్ని సవ్యంగా జరిగితే మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కలయికలో రూపొందే సినిమాకు వంశి కథ అందించే అవకాశం లభిస్తుంది. ఈ సినిమా 2015 చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ సమయంలో మహేష్ బాబు ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలను.. పూరి జగన్నాధ్ వరుణ్ తేజ్, ఛార్మి ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలను కంప్లీట్ చేయాలి.

తాజా వార్తలు