పుకార్లను ఖండించిన సమంత.

పుకార్లను ఖండించిన సమంత.

Published on Feb 7, 2015 11:06 AM IST

Samantha

అడ్వర్టైజింగ్ రంగంలో రారాణి వెలుగొందుతున్న ప్రముఖ హీరోయిన్ సమంత, తాజాగా 6 కోట్లకు ఓ సంస్థతో ఒప్పందం చేసుకుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ అండర్ గార్మెంట్స్ కంపెనీ జాకీకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి సమంత అంగీకరించిందని ఆ వార్త సారాంశం. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని సమంత తెలిపింది. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఒకసారి నిజానిజాలు తెలుసుకోవాలని ఆంగ్ల దినపత్రికకు హితవు పలికింది. ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా, కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించకూడదని సమంత నిర్ణయం తీసుకుందని ఆమె సన్నిహితులు వ్యాఖ్యానించినట్టు సమాచారం.

అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా చిత్రీకరణలో ఉన్న సమంత.. త్వరలో ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాకు సంతకం చేసింది. తమిళంలో విక్రమ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు