రామ్ సరసన నేహ శర్మ సిస్టర్

రామ్ సరసన నేహ శర్మ సిస్టర్

Published on Feb 15, 2015 10:03 AM IST

Aisha_ram2
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన ‘చిరుత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నేహ శర్మ. ఆ తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత హిందీలో సినిమాలు చేస్తున్న ఈ భామ తన సిస్టర్ ఐశా శర్మని తెలుగులో లాంచ్ చేయనుంది. తాజా సమాచారం ప్రకరం ఐశా శర్మ రామ్ హీరోగా నటిస్తున్న ‘శివం’ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఐశా చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఐశా శర్మ గత కొంతకాలంగా యాక్టింగ్, కథక్ మరియు వాయిస్ మాడ్యులేషన్స్ పై కోచింగ్ తీసుకుంటోంది.

ఐశా శర్మ తన తెలుగు తొలి పరిచయ సినిమా గురించి మాట్లాడుతూ ‘నేను హీరోయిన్ అవ్వాలని కలలు కన్న నా డ్రీం నిజం అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుగులో శివం సైన్ చేసాను, హిందీలో కూడా పలు ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదుఇక స్టార్ అండ్ సూపర్బ్ యాక్టర్ తనతో నటించే చాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉందని’ తెలిపింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాకి నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు