తదుపరి చిత్రంకోసం భారీగా ఖర్చుపెడుతున్న రామ్ గోపాల్ వర్మ

తదుపరి చిత్రంకోసం భారీగా ఖర్చుపెడుతున్న రామ్ గోపాల్ వర్మ

Published on Feb 17, 2015 11:19 PM IST

RGV
‘శివ’, ‘గాయం’ మరియు ‘సత్య’ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలు ఇవ్వడంలో బిజీగా వున్నాడు. లో బడ్జెట్ లో సినిమాలు చేస్తూ లెజెండరీ దర్శకుడు స్థాయినుండి ఇన్నోవేటివ్ దర్శకుడు అనే మార్కుకి చేరుకున్నాడు. అయితే తానూ తీస్తున్న నాసిరకం హర్రర్ సినిమాలను చూసే ఓపిక ప్రేక్షకులకు లేదని రామూ తెలుసుకున్నాడు.

ప్రస్తుతం నందూ, అనైకా సోటిల కాంబినేషన్ లో ‘365 days’ అనే సినిమాను తీస్తున్నాడు. ఒక పత్రికతో మాట్లాడుతూ ఈ సినిమాపై 4కోట్లు ఖర్చుపెట్టినట్టు కేవలం ఒక రెయిన్ సాంగ్ కోసం 35లక్షలు పెట్టినట్టు తెలిపి షాకిచ్చాడు. దాదాపు సున్నా బడ్జెట్ లో సినిమాలు తీస్తున్న రామూ నోటినుండి ఇటువంటి ఫిగర్లు రావడం విశేషమే.

ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. కనీసం ఈ ప్రేమకధతోనైనా రామూ తిరిగి ఫామ్ లోకి తిరిగిరావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు