టాలీవుడ్ లో పరాజయం లేని దర్శకుడిగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం ప్రభాస్, రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు, ఫిల్మ్ ఇండస్ట్రీ వారంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ని చివరి దశకు తీసుకు రావడమే కాకుండా ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
తాజాగా రాజమౌళి ట్విట్టర్ లో మొట్ట మొదటి తెలుగు వర్డ్ #బాహుబలివస్తున్నాడు అనేదాన్ని ట్రెండ్ చెయ్యడమే కాకుండా బాహుబలి కోసం ఇంకాస్త సమయం వెయిట్ చేయమని అన్నాడు. ‘ప్రభాస్ అభిమానులు ఎంతో ఓపికతో ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు వాళ్ళని మెచ్చుకుంటున్నాను. సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నాం. ఇంకా చాలా విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కానీ సమయం దొరకడం లేదు. ఇంకాస్త సమయం వేచి ఉండండి. త్వరలోనే ఆడియో, ట్రైలర్ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తామని’ తెలిపాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.


