నైజాంలో బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తున్న ‘టెంపర్’

నైజాంలో బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తున్న ‘టెంపర్’

Published on Feb 18, 2015 12:49 PM IST

Temper-movie-review

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ లో చెప్పినట్టుగానే ‘టెంపర్’ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద దండయాత్ర చేస్తున్నాడు. అభిమానులంతా కాలర్ ఎగరేసుకొని తిగిగే హిట్ ఇవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకున్తున్నాడు. ఎన్.టి.ఆర్ లుక్స్ పరంగా ఎన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించడమే కాకుండా యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీలో కూడా కొత్తదనం చూపించి టెంపర్ తో ప్రేక్షకులను మెప్పించాడు.

ఈ సినిమాకి మొదటి రోజు నుంచే నైజాంలో అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే నైజాంలో 5 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా వీక్ డే అయిన సోమవారం కూడా కలెక్షన్స్ ని భారీగానే రాబట్టుకుంది. అలాగే నిన్న శివరాత్రి కావడం వలన అందరికీ సెలవు రోజు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగాయి. మాకు అందిన సమాచారం ప్రకారం నైజాంలో మొదటి 7 రోజుల్లో 7.8 కోట్ల షేర్ సాధించింది. మొదటి వారంలో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ పోలీస్ డ్రామాని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు