
తమిళ స్టార్ హీరో అజిత్, అనుష్క, త్రిష నటినటులుగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ఎన్నై ఆరిందాల్’. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాదించింది. అమెరికాలో ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ (4.1 మిలియన్ డాలర్స్) వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో టాప్ 10 కలెక్షన్స్ సాదించిన సినిమాలలో చోటు దక్కించుకుంది.
తెలుగులో ఈ సినిమాను ‘ఎంతవాడు గాని’ పేరుతో అనువదిస్తున్నారు. ఫిబ్రవరి 27న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. గత ఏడాది ‘వీరుడోక్కడే’ సినిమాతో తెలుగులో విజయాన్ని అందుకున్న అజిత్, ఈ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకుంటారని ఆశిద్దాం. హారిస్ జయరాజ్ ఆడియోకు మంచి స్పందన లభించింది.

