ఫిబ్రవరి 27న వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ లాంచ్

ఫిబ్రవరి 27న వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ లాంచ్

Published on Feb 24, 2015 3:30 AM IST

Varun-teja-krish (1)
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ చేసిన మొదటి సినిమా ‘ముకుంద’ తనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ పూరి జగన్నాధ్ మరియు క్రిష్ లతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలలో ముందుగా క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 27న క్రిష్ – వరుణ్ తేజ్ మూవీని లాంచనంగా ప్రారంభించనున్నారు.

‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన క్రిష్ వరుణ్ తేజ్ కోసం కూడా ఓ డిఫరెంట్ కథని రెడీ చేసాడు. ఈ సినిమా మొత్తం 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుందనే విషయాన్ని మేము మీకు ఇది వరకే తెలియజేశాం. . ఇదొక ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. దీని గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తనని తానూ మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నాడు. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు పూరి జగన్నాధ్ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు