
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య లవర్ బాయ్ ఇమేజ్ ని కాస్త పక్కన పెట్టి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘దోచేయ్’. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కొన్ని పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పాచ్ వర్క్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ రోజుతో ఆ సీన్స్ ఫినిష్ చేసి రెండు సాంగ్స్ షూటింగ్ కోసం ఈ చిత్ర టీం రేపు అబ్రాడ్ వెళ్లనున్నారు. ఈ అబ్రాడ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
నాగ చైతన్య ఈ సినిమాలో ఓ స్టైలిష్ దొంగ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నాగ చైతన్యకి ఓ డిఫరెంట్ ఇమేజ్ ని ఇస్తుందని భావిస్తున్నాడు. నాగచైతన్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మధురిమ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ సినిమాకి సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

