వీకెండ్ వెంకట రావుగా బ్రహ్మానందం..!

వీకెండ్ వెంకట రావుగా బ్రహ్మానందం..!

Published on Feb 25, 2015 12:03 PM IST

brahmanandam
2015లో తెలుగు తెరపై బ్రహ్మానందం ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదని బ్రాహ్మీ అభిమానులు, హాస్య ప్రియులు కాస్త వెలితిగా ఫీలయ్యారు. సినిమాలో ఎంత కామెడీ ఉన్నా, తెరపై బ్రాహ్మీ లేని లోటు కనబడుతుంది. ‘పండగ చేస్కో’ సినిమాతో ఆ లోటును భర్తీ చేయడానికి రెడీ అయ్యారు.

రామ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పండగ చేస్కో’. సోనాల్ చౌహన్ మరో హీరోయిన్. ఈ సినిమాలో వీకెండ్ వెంకట రావుగా బ్రహ్మానందం సందడి చేయనున్నారు. కడుపుబ్బా నవ్వించే క్యారెక్టర్ అంట. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ఈ వారమే మొదలయ్యింది.

యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు