స్వర్గస్తులైన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎ.విన్సెంట్

స్వర్గస్తులైన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎ.విన్సెంట్

Published on Feb 25, 2015 1:20 PM IST

Vincent
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో పనిచేసిన లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్ ఎ. విన్సెంట్ ఈ రోజు చెన్నైలో మరణించారు. గత కొంత కాలంగా హార్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం ‘హార్ట్ ఎటాక్’ తో చనిపోయారు. 86 సంవత్సరాల విన్సెంట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మరియు ఎంతో మంది లెజండ్రీ నటీనటులతో కలిసి పనిచేసారు. 1928లో జన్మించిన ఆయన 1953లో వచ్చిన బ్రతుకు తెరువు సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు.

సోగ్గాడు, జ్యోతి, అడవి రాముడు, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఆపద్భాందవుడు, అశ్వమేధం, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహంలతో పాటు హిందీలో రీమేక్ అయిన ప్రేమ్ నగర్ సినిమాకి కూడా ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. విన్సెంట్ చివరిగా చేసిన సినిమా ‘అన్నమయ్య’. విన్సెంట్ మరంతో ఆయన కుటుంబం శోఖ సముద్రంలో మునిగారు.

లెజండ్రీ సినిమాటోగ్రాఫర్ ఎ. విన్సెంట్ స్వర్గస్తులైన సదర్భంగా ఎంతో చింతిస్తూ 123తెలుగు.కామ్ తరపున ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు