
హీరో విశాల్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో వచ్చిన ‘పందెం కోడి’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుంది. 123తెలుగు.కామ్ గతంలో ఈ వార్తను పాఠకులకు తెలియజేసింది.
దర్శకుడు లింగుస్వామి ‘పందెం కోడి’ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. మే 1వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలో హీరోయిన్ను సెలెక్ట్ చేసే షెడ్యూల్ ప్రకారం షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ శుక్రవారం విశాల్, హన్సిక జంటగా నటించిన ‘మగ మహారాజు’ తెలుగులో విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కిరణ్, ఐశ్వర్యలు విశాల్ కు అత్తలుగా నటించారు. సుందర్.సి ఈ సినిమాకు దర్శకుడు.

