మలయాళంకి వెళ్ళిన తెలుగమ్మాయి రేష్మ రాథోర్

మలయాళంకి వెళ్ళిన తెలుగమ్మాయి రేష్మ రాథోర్

Published on Feb 26, 2015 12:38 PM IST

Reshma-Rathore
‘ఈ రోజుల్లో’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి రేష్మ రాథోర్. మొదట్లో కెరీర్లో ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన రేష్మ రాథోర్ కి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. గత సంవత్సరం రేష్మ రాథోర్ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాలకు సైన్ చేసింది. ప్రస్తుతం తమిళ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న రేష్మ ఈ సంవత్సరం మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టనుంది.

తాజా సమాచారం ప్రకారం మలయాళంలో ఓ సినిమాకి సైన్ చేసింది. మలయాళ యంగ్ హీరో సన్నీ వినే హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అప్పవుం వీన్జం అనే టైటిల్ ని ఖరారు చేసారు. విశ్వనాథన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ రేష్మ రాథోర్ కి మదర్ పాత్రలో కనిపించనుంది. అంతే కాకుండా రేష్మ రాథోర్ కన్నడలో కూడా ఓ సినిమాకి సైన్ చేసింది. ఈ ఏడాది తను నటించిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు రిలీజ్ అవ్వనుండడంతో రేష్మ చాలా హ్యాపీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు