పూరి చేతిలో 5 సినిమాలు, నితిన్ తో మరో మూవీ.!

పూరి చేతిలో 5 సినిమాలు, నితిన్ తో మరో మూవీ.!

Published on Feb 27, 2015 1:00 AM IST

Puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం గురువుకు తగ్గ శిష్యుడు అనే సామెతని సార్ధకత చేసే పనిలో ఉన్నాడు. పూరి కూడా తన గురువు రామ్ గోపాల్ వర్మ లానే వరుసగా సినిమాలు చేయాలనే పనిలో ఉన్నాడు. ఇటీవలే టెంపర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి జగన్నాధ్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. ఏది ముందు ఏది వెనుక అనేది పక్కన పెడితే వరుసగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాల వివరాల లోకి వెళితే..

పూరి జగన్నాధ్ చార్మీతో చేయనున్న ‘జ్యోతి లక్ష్మీ’ని నిన్ననే అధికారికంగా మొదలు పెట్టాడు. రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తిచేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో ఓ సినిమా ఉంది. వరుణ్ తేజ్ క్రిష్ సినిమా ఆమోదాలు పెడుతుండడంతో పూరి కాస్త వెనక్కి వెళ్ళాడు. ఇటీవలే దాసరి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఆ సినిమాకి కూడా పూరి డైరెక్టర్ అని అనుకుంటున్నారు. ఇది కాకుండా నితిన్ తో మరో సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇవన్నితికంటే ముందు మహేష్ తో సినిమా చెయ్యడానికి కథ కూడా రెడీ చేసాడు. కానీ మహేష్ డేట్స్ లేటవుతుండడంతో దాని కాస్త వెనక్కి వేసాడు. ప్రస్తుతానికి పూరి చేతిలో ఉన్న ఈ ఐదు సినిమాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏ ఆర్డర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తాయనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు