
దిల్ రాజు గా ప్రేక్షకులకు చేరువైన వెంకటరామి రెడ్డి టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరు. పంపిణీదారునిగా కెరీర్ ని ప్రారంభించిన రాజుగారు ఎందరో కొత్త దర్శకులను మనకు పరిచయం చేసారు.
బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం వంటి క్లాసిక్స్ ని మనకు అందించిన రాజు గారు తాజాగా కృష్ణాష్టమి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఎటువంటి సమాచారం లేకపోయినా టైటిల్ ని బట్టి మరో ఫ్యామిలీ డ్రామాతో మనముందుకు రానున్నట్టు తెలుస్తుంది

