తమిళంలోకి వెళ్లనున్న నాగ చైతన్య.!

తమిళంలోకి వెళ్లనున్న నాగ చైతన్య.!

Published on Mar 1, 2015 3:46 PM IST

Naga-Chaitanyas-first-look
అక్కినేని వారి యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ ని ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నాడు. నాగ చైతన్య వరుసగా యంగ్ టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. గత ఏడాది ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్ అందుకున్న విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒక లైలా కోసం సినిమా చేసి విజయం అందుకున్న చైతన్య ఇప్పుడు స్వామి రారా ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది పూర్తి కాకముందే కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చందూ మొండేటితో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఒక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాతో నాగ చైతన్య తమిళంలో కూడా హీరోగా పరిచయం కావడానికి సిద్దమవుతున్నాడు. నాగ చైతన్య – చందూ మొండేటి సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో షూట్ చేసి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ నాగ చైతన్య తమిళంలో కనిపించలేదు. ఈ థ్రిల్లర్ తో తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని చూస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు