‘లయన్’ శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్.!

‘లయన్’ శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్.!

Published on Mar 1, 2015 7:57 PM IST

balkrishna-lion
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ శివార్లలో జరుగుతోంది. ఇటీవలే మొయినాబాద్ లో బాలకృష్ణపై ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఎలా ఉంటుందా అనేది అభిమానులకు కాస్త సాంపిల్ చూపించాడు.

దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఈ సినిమా ఆడియో కూడా రిలీజ్ కాకముందే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ వారు సొంతం చేసుకున్నారు. అది కూడా ఓ భారీ మొత్తానికి తీసుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు