రేపటి నుండి ‘బెంగాల్ టైగర్’ రెగ్యులర్ షూటింగ్.

రేపటి నుండి ‘బెంగాల్ టైగర్’ రెగ్యులర్ షూటింగ్.

Published on Mar 2, 2015 1:38 PM IST

ravi-teja
సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించబోయే ‘బెంగాల్ టైగర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘కిక్ 2’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

‘బెంగాల్ టైగర్’ సినిమాలో రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరూ మొదటిసారి రవితేజతో జోడి కడుతున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారని యూనిట్ వర్గాల సమాచారం.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు