
శ్రీ దివ్య, క్రాంతి, హేమంత్ నటీనటులుగా సతీష్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారధి’. నూతన నిర్మాణ సంస్థ కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై పెన్మత్స వివేకానంద వర్మ ఈ సినిమాను నిర్మించారు. ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాను మార్చి 13న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వినోదాత్మకంగా తెరకెక్కించిన ముక్కోణపు ప్రేమకథ ‘వారధి’. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. సినిమాలో చక్కని సందేశం ఉంటుంది. ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారు. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అని నిర్మాత వివేకానంద వర్మ తెలిపారు.
విజయ్ గొర్తి చక్కని సంగీతం అందించిన పాటలు ఇటివలే విడుదలయి మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్ , శ్రీనివాస రెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో సందడి చేయనున్నారు.

