
‘లౌక్యం’ సినిమా సూపర్ హిట్ అందుకున్న మాచో హీరో గోపీచంద్ నటిస్తున్న తదుపరి సినిమా ‘జిల్’. గోపీచంద్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తాన్ని దాదాపు పూర్తి చేసాడు. ప్రస్తుతం ఈ సినిమాలో బాలన్స్ ఉన్న సాంగ్స్ మరియు ప్యాచ్ వర్క్ ని ఫినిష్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
షూటింగ్ దాదాపు చివరి దశలో ఉండడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా అదుఇఒ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. యువ సంచలనం జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని మార్చి 12న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమాని కూడా మార్చి 27న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన బ్యూటిఫుల్ రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.

