
ఆర్.సి.సి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నవదీప్, నవీన్ చంద్రలు హీరోలుగా నటించిన సినిమా.. ‘భమ్ భోలేనాథ్’. కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమా సక్సెస్ మీట్‌ను మంగళవారం నిర్వహించారు.
హీరో నవదీప్ మాట్లాడుతూ.. సినిమాకు యువత నుంచి మంచి స్పందన వస్తోందని, కన్నడ రీమేక్ హక్కులు కూడా ఇప్పటికే అమ్ముడుపోయినట్టు చెప్పారు. మరో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఒక కొత్త కథను డిఫరెంట్ వేలో తీశామని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఓపెనింగ్స్ బాగున్నాయని, మున్ముందు ఇంకా బాగా కలెక్ట్ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. స్క్రీన్‌ప్లే బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. కొందరు విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని స్క్రీన్‌ప్లే రెడీ చేసుకున్నామని ఆయన అన్నారు. హీరోయిన్ పూజ మాట్లాడుతూ.. తన మొదటి సినిమాకే ఈ విజయం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు. శిరువూరి రాజేష్ వర్మ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు.. రఘు పెన్మెత్స, కాకర్లపూడి రామకృష్ణ, యాడవల్లి తేజలు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

