ఛార్మీ స్పెషల్ సాంగ్ కోసం 3 కోట్లట.!

ఛార్మీ స్పెషల్ సాంగ్ కోసం 3 కోట్లట.!

Published on Mar 3, 2015 5:49 PM IST

Charmi
బబ్లీ హీరోయిన్ ఛార్మీ చేయనున్న ఓ స్పెషల్ సాంగ్ కి 3 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు విన్న 3 కోట్ల మాట నిజమే కానీ అది చార్మీ తీసుకున్న రెమ్యునరేషన్ కాదు, ఛార్మీ పాట కోసం పెడుతున్న ఖర్చు. ఇప్పటికే పలుసార్లు ఛార్మీ హీరోయిన్ గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించి ఎంటర్టైన్ చేసింది. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ – సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ’10 ఎన్రాదుకుల్ల’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఛార్మీ సైన్ చేసిందని తెలియజేశాం.

అన్ని సినిమాల్లోలా చేసే స్పెషల్ సాంగ్ లా కాకుండా కథలో భాగంగా బాగా నాటకీయంగా ఉండే ఈ ఛార్మీ స్పెషల్ సాంగ్ నిడివి 9 నిమిషాలు. అందుకే ఈ పాత కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఈ చిత్ర టీం పూణే దగ్గర లోని ఓ హిల్ ప్రాంతంలో ఓ భారీ సెట్ వేస్తోంది. ఆ సెట్ ని సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ని షూట్ చేయనున్నారు. రోడ్ జర్నీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సమ్మర్ చివర్లో రానుంది.

ఇది కాకుండా ఛార్మీ కొద్ది రోజుల క్రితమే పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ‘జ్యోతి లక్ష్మీ’ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది. ఇది కాకుండా మంత్ర 2 షూటింగ్ ని దాదాపు పూర్తి చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు