మే 15న పూరి తనయుడి ‘ఆంధ్రా పోరి’

మే 15న పూరి తనయుడి ‘ఆంధ్రా పోరి’

Published on Mar 3, 2015 5:50 PM IST

andhra-pori
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఆంధ్రా పోరి’. ‘ఋషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాష్ సరసన ‘ఝాన్సీ’ సీరియల్ ఫేం ఉల్క గుప్తా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను మే 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.

టీనేజ్ ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ చక్కని నటన కనబరుస్తున్నారని యూనిట్ సభ్యుల టాక్. నిన్నటితో ఈ సినిమా ఖమ్మం షెడ్యూల్ పూర్తయింది. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘టైంపాస్’ సినిమాకు రీమేక్ ఈ ‘ఆంధ్రా పోరి’. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జోస్య భట్ల సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల తేది ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు