కమల్ హాసన్ దర్శకత్వంలో థ్రిల్లర్..?

కమల్ హాసన్ దర్శకత్వంలో థ్రిల్లర్..?

Published on Mar 4, 2015 1:13 AM IST

KAMAL_HAASAN
మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి కమల్ హాసన్ రెడీ అయ్యారు అనే వార్త చెన్నై మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటివలే కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ పాటలు విడుదలయ్యాయి. త్వరలో సినిమా విడుదల కానుంది. ఇది కాకుండా కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం 2’, దృశ్యం రీమేక్ ‘పాపనాశనం’ సినిమాలు నిర్మాణంతర కార్యక్రమాలలో ఉన్నాయి. ఈ మూడు సినిమాల షూటింగులు పూర్తయ్యాయి.

త్వరలో కమల్ హాసన్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇటివలే మారిషస్ వెళ్లి లొకేషన్లు ఎంపిక చేశారు. ఈ థ్రిల్లర్ సినిమాకు కమల్ దర్శకత్వం వహిస్తారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ థ్రిల్లర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అని కమల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

బహుశా థ్రిల్లర్ సినిమా పూర్తయిన తర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కమల్ నటిస్తారేమో..? వీరేంద్ర అరోరా మరియు అర్జున్ కె కపూర్ ల నిర్మాణంలో ఓ స్ట్రెయిట్ హిందీ సినిమా చేయడానికి కూడా కమల్ అంగీకరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు