
భారతదేశం మెచ్చిన నటుడు కమల్ హాసన్. ఆయన ఇప్పటి వరకూ ఒక నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించాడు. కానీ ఇప్పటి వరకూ కమల్ హాసన్ బాలీవుడ్ లో వేరే హీరో నటించే సినిమాకి నిర్మాతగా వ్యవహరించలేదు. తొలిసారిగా కమల్ హాసన్ ‘అమర్ హై’ అనే సినిమాని వీరేంద్ర అరోరా, అర్జున్ కె. కపూర్ లతో కలిసి నిర్మించనున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు హీరో పాత్రలో కనిపించనుండగా కమల్ హాసన్ ఓ కీలక పాత్రలో అలా కనిపించి మాయం కానున్నాడు.
ఈ అమర్ హై సినిమా ప్రస్తుత రాజకీయాలను, మనీ లాండరింగ్ అంశాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ సినిమాని 2015 నవంబర్ లో స్టార్ట్ చేసి కంటిన్యూ షూటింగ్ చేసి 5 నెలల్లో సినిమాని పూర్తి చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ దర్శకత్వం వహించనున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ కోసం లొకేషన్స్ ని చూస్తున్నాడు. ఈ రెండు సినిమాల పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇవన్నీ కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశం’ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

