బాలకృష్ణ ‘లయన్’లో అర్చన ఐటెం సాంగ్..

బాలకృష్ణ ‘లయన్’లో అర్చన ఐటెం సాంగ్..

Published on Mar 11, 2015 11:47 AM IST

balakrishna-and-archana
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే కమర్షియల్ హంగులు ఉండాల్సిందే. వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు దర్శకుడు సత్యదేవా. నట సింహం బాలయ్యను ‘లయన్’గా ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు. సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇద్దరు అందాల భామలు త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో అందగత్తె అర్చన ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.

ప్రత్యేక పాత్రతో పాటు ఓ ఐటెం సాంగులో కూడా అర్చన నటించింది. ఆమె పాట సినిమాకు అదనపు ఆకర్షణ అని చిత్ర బృందం చెప్తుంది. గతంలో బాలయ్యతో కలిసి ‘పాండురంగడు’, ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నటించింది. హీ ఈజ్ వెరీ కోపరేటివ్ కో స్టార్ అని చెప్పింది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ‘లయన్’ ఆడియోను మార్చి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రుద్రపాటి రమణారావు ఈ సినిమాకు నిర్మాత.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు