‘కింగ్ 100’పై సీనియర్ బ్యూటీ సాలిడ్ అప్డేట్..!

‘కింగ్ 100’పై సీనియర్ బ్యూటీ సాలిడ్ అప్డేట్..!

Published on Apr 27, 2026 9:04 PM IST

అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం #King100 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాపై సీనియర్ బ్యూటీ టబు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.

ఈ మైల్‌స్టోన్ మూవీలో తాను కూడా నటిస్తున్నట్లు టబు తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటిస్తోంది. గతంలో నాగ్-టబు కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు వెండితెరపై కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

ఈ యాక్షన్ డ్రామాను అన్నపూర్ణ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున 100వ సినిమా కావడంతో ప్రతి పాత్ర విషయంలోనూ మేకర్స్ ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు