సాయి ధరమ్ తేజ్ హీరోగా, వై. వీ.ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సినిమా.. ‘రేయ్’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికి థియేటర్ల ముందుకు రానుంది. మార్చి 27న ఈ సినిమా విడుదల అవనున్న నేపథ్యంలో ఆ సినిమా హీరోయిన్ సయామి ఖేర్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలివి.
ప్రశ్న) రేయ్ సినిమా గురించి చెప్పండి ?
స) రేయ్ సినిమా నాకొక చక్కటి లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. యూనిట్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ పనిచేశాం. కొద్ది కాలంలోనే మేమంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సాయిధరమ్ తేజ్‌ని సంవత్సరం నుంచి కలవకున్నా ఇప్పటికీ మేమంతా మంచి ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ సినిమా ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. అందరికీ నచ్చే సినిమా అవుతుందని భాచిస్తున్నా.
ప్రశ్న) భాష విషయంలో ఏవైనా ఇబ్బందులు పడ్డారా ?
స) నేనిక్కడికి వచ్చిన తర్వాతే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టా. తెలుగులో పూర్తిగా మాట్లాడలేకపోయినా, చెప్పేది మాత్రం అర్థమవుతుంది. భాష విషయంలో రేయ్ టీమ్ నాకెంతో సహకరించింది.
ప్రశ్న) సినిమాల్లోకి ఎలా వచ్చారు ?
స) 2012 టైమ్‌లో కింగ్‌ఫిషర్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఫోటోషూట్ చూసిన తర్వాత వై. వీ. ఎస్ చౌదరి గారు తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఆడిషన్ పూర్తి చేసుకున్న తర్వాతే హీరోయిన్‌గా అవకాశమిచ్చారు.
ప్రశ్న) ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
స) ఈ సినిమాలో నాదొక సింపుల్ అమ్మాయి పాత్ర. ఇండియా నుంచి అమెరికా వెళ్ళే ఒక అమ్మాయిగా ఇందులో నటించాను. ఈ సినిమాలో నటించడానికి మంచి స్కోప్ ఉన్న పాత్ర నాది.
ప్రశ్న) సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించడం ఎలా ఉండేది ?
స) ముందే చెప్పినట్టు చాలా తక్కువ సమయంలోనే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. చిరంజీవి లాంటి సూపర్ స్టార్‌కి అల్లుడైనా కూడా చాలా కూల్‌గా ఉండేవాడు. షూటింగ్ గ్యాప్‌లో మేమంతా కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళం.
ప్రశ్న) పవన్ కళ్యాణ్ రేయ్ ఆడియో ఫంక్షన్‌కి వచ్చారు కదా.. దాని గురించి ?
స) పవన్ కళ్యాణ్ గారిని నేను అదే చూడడం. ఆయనొక గ్రేట్ పర్సన్. ఆయకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ని చూసి ఆశ్చర్యపోయా. ఆయన సినిమాలు కొన్ని చూశాను.. చాలా బాగా చేశారు. సాయి ధరమ్ తేజ్‌కి, పవన్ కళ్యాణ్‌కి పోలికలున్నాయి. వాళ్ళిద్దరూ మాట్లాడడం, కూర్చోవడం ఒకేలా ఉంటుంది.
ప్రశ్న) తెలుగు హీరోల్లో మీ ఫేవరెట్ స్టార్
స) నేను తెలుగులో చాలా తక్కువ సినిమాలు చూశాను. మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల సినిమాలు చూశాను. ఎవరు ఫేవరెట్ అంటే ఏం చెప్పను ? అందరితోనూ కలిసి పని చేయాలని ఉంది.
ప్రశ్న) మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ?
స) నేను సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చాను. మా కుటుంబంలో చాలామంది సినిమాల్లో, మోడలింగ్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను సినిమాల్లోకి వస్తున్నానంటే వాళ్ళంతా సంతోషించారు. తెలుగులో సినిమా చాన్స్ వచ్చిందంటే.. మా వాళ్ళు అక్కడైతే చాలా నేర్చుకోవచ్చని చెప్పారు.
ప్రశ్న) ఎక్కడైనా యాక్టింగ్ కోర్సు లాంటిది చేశారా ?
స) రేయ్ సినిమానే నాకు అతిపెద్ద యాక్టింగ్ కోర్సు. దర్శకుడు వై. వీ. ఎస్. చౌదరి గారు యాక్టింగ్ ఎలా చేయాలన్నదానిపై మంచి ట్రైనింగ్ ఇచ్చారు. రేయ్ సినిమా నేను నటన నేర్చుకోవడానికి గొప్ప అవకాశంగా భావించాను.
ప్రశ్న) లిప్‌లాక్ సన్నివేశాల్లో నటిస్తారా ?
స) పాత్ర డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్లలో నటించడంలో తప్పుఏముంది ? నావరకు నేను అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం వచ్చినపుడు తప్పక నటిస్తా. నా తర్వాతి హిందీ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశం ఉంది.
ప్రశ్న) ప్రస్తుతం ఏదైనా తెలుగు సినిమా చేస్తున్నారా ?
స) లేదు. ప్రస్తుతానికి తెలుగు సినిమా ఏదీ చేయడం లేదు. హిందీలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మంచి అవకాశం వస్తే.. తప్పక చేస్తా.
ప్రశ్న) మీ డ్రీమ్ రోల్ ఏంటి ?
స) డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. ఈ సినిమాలో నేను చేసింది డ్రీమ్ రోల్ అనే చెప్పాలి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలను నేను చెయ్యను. ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ పాత్రలే చేస్తాను. రేయ్‌లో నేను చేసింది అలాంటి పాత్రే.
రేయ్ గురించి ఒక్క మాటలో..
అందరికీ నచ్చే విధంగా సినిమాని నిర్మించారు. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా.


