ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న రామ్‌చరణ్

ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న రామ్‌చరణ్

Published on Mar 14, 2015 3:00 PM IST

ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న రామ్ చరణ్ అందుకు సంబంధించిన వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. కోనవెంకట్, గోపీ మోహన్, శ్రీను వైట్లల త్రయం మళ్ళీ కలిసి పని చేస్తుండడం ఈ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి కొంత సమయం ఉన్నందున ఈలోపు రామ్ చరణ్ తన ఫాం హౌస్‌లో సేద తీరుతున్నాడు.

బెంగళూరులోని తన ఫాం హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న చెర్రీ, ఇదే విషయమై తన సోషల్ సైట్‌లో పోస్ట్ చేశారు. ఒక చిన్న దూడ ఫోటోని పోస్ట్ చేసి, తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ చేరిందని ఆయన అన్నారు. దాని నుదురుపై లవ్ సింబల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక చెర్రి ఇంకొన్ని రోజులు తన ఫాం హౌస్‌లో సేద తీరి కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు