
దర్శకనిర్మాత అయిన వైవిఎస్ చౌదరి మెగా ఫ్యామిలీ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘రేయ్’. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలు సార్లు వాయిదా పడడం వల్ల సాయి ధరమ్ తేజ్ రెండవ సినిమాగా రావాల్సిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందే రిలీజ్ అయిపోవడమే కాకుండా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడం వలన ‘రేయ్’ ఫైనాన్సియల్ ఇబ్బందులు చాలా వరకూ క్లియర్ అయ్యి రిలీజ్ కి సిద్దమవుతోంది. కొద్ది రోజుల క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాని మార్చి 27న గ్రాండ్ గా ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. డాన్సర్ గా అదిరిపోయే స్టెప్స్ వేశాడని సమాచారం. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసేలా ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ తో మెగా అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాడని ఈ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి సాంగ్ లో సూపర్బ్ స్టెప్స్ తో ఆకట్టుకుంటాడని సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

